టోక్యో పారాలింపిక్స్ లో భారత్ బోణి

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ బోణి

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ పటేల్ సిల్వర్ మెడల్ గెలిచారు. మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 విభాగం ఫైనల్లో చైనా ప్లేయర్ యింగ్ జోవుతో తలపడింది భవీనా పటేల్. అయితే 0-3 తో భవీనా ఓడిపోయింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్ హిస్టరీలో టేబుల్ టెన్నిస్ లో భారత్ కు ఇదే ఫస్ట్ మెడల్. 

భవీనా సిల్వర్ మెడల్ గెలవడంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. భవీనా పటేల్ చరిత్ర సృష్టించారని... ఆమె జీవితం ఎందరికో స్పూర్తిదాయకమన్నారు. ఇక గుజరాత్ లోని మెహసానాలో భవీనా ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్నార కుటుంబసభ్యులు. గార్బా డ్యాన్స్ చేస్తూ... క్రాకర్స్ కాల్చి... స్వీట్స్ తినిపించుకుని ఆనందం పంచుకున్నారు. భవీనా తమను గర్వపడేలా చేసిందని... ఆమెకు ఘనస్వాగతం పలుకుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.