టమాటా ఆటో బోల్తా..టామాటాలను కాపాడేందుకు డ్రైవర్ తిప్పలు

టమాటా ఆటో బోల్తా..టామాటాలను కాపాడేందుకు డ్రైవర్ తిప్పలు

ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరులో టమాటాలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. జాతీయ రహదారిపై డ్రైవర్ ఆర్టీసీ బస్సును తప్పించబోగా.. ఆటో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై చెల్లాచెదురుగా టమాటాలు, కూరగాయలు పడిపోవడంతో వాటిని కాపాడేందుకు డ్రైవర్ ఇబ్బంది ఎదుర్కొన్నాడు.  వెంటనే మరో ఆటో తెప్పించి కూరగాయలను షిఫ్ట్ చేశాడు. వరంగల్ నుంచి ఏటూరునాగారం కూరగాయలు తీసుకెళ్తుండగా ఈప్రమాదం జరిగింది.