ఓటు హక్కుపై దాడి చేస్తే ఊరుకోం : వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమ , వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు

ఓటు హక్కుపై దాడి చేస్తే ఊరుకోం : వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమ , వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు
  •     ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, రేవూరి 
  •     ఓట్​ చోరీపై గ్రేటర్  వరంగల్ లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

వరంగల్‍, వెలుగు: ఓటు హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, ఇండియా కూటమి ఊరుకోదని వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమ , వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఓట్​ చోరీకి వ్యతిరేకంగా సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ జంక్షన్‌‌‌‌‌‌‌‌ నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్వర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఇండియా కూటమి నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఇండియా కూటమి నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుడి, బడిని దోచుకున్న బీజేపీ ఇప్పుడు ఓట్లను కూడా దోచుకుంటోందని విమర్శించారు. ఓటు హక్కుకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఒడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌, కుడా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ గుండు సుధారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు ఖుస్రూ పాషా, అజీజ్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్న అప్పారావు పాల్గొన్నారు.