చేవెళ్ల, వెలుగు: పంటను కాపాడేందుకు వేసిన వేసిన విద్యుత్ కంచె తగిలి చిన్నారి మృతి చెందింది. మీర్జాగూడకు చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య, అనిత దంపతులకు వర్షిణి (07), రుత్విక్ (05) ఇద్దరు పిల్లలు. మంగళవారం తమ పెద్దమ్మ మౌనికతో కలిసి మంగళవారం పొలం వద్దకు వెళ్లారు. అయితే అడవి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి పెదనాన్న మల్లేశ్ పొలం చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు.
ఇది తెలియని పిల్లలు ఆడుకుంటూ ముందుగా పరుగెత్తడంతో విద్యుత్ కంచెకు తగిలారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వర్షిణి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గాయపడిన రుత్విక్‌ను మెరుగైన చికిత్స కోసం సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
