ఆర్టీసీని లాభాల్లోకి తేవడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు

ఆర్టీసీని లాభాల్లోకి తేవడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు
  • టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. గత సంవత్సరం 2200 కోట్ల నష్టం వచ్చింది.. నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం కృషి చేస్తోందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీని లాభాల్లోకి తేవడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకురాబోతున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ అబిడ్స్ లో ఏర్పాటు చేసిన కొత్త స్కూల్ ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్, డీజిల్ రేట్ పెరగడం తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త బస్సుల ద్వారా.. నూతన సంస్కరణలు అమలు చేసి రానున్న రోజుల్లో లాభాల బాట పట్టిస్తామన్నారు. సంస్కరణల్లో భాగంగా ఇటీవల తాము ప్రారంభించిన మ్యాంగో ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని ప్రస్తావించారు. ఈ స్ఫూర్తితో సేవలను మెరుగుపరచుకుంటూ త్వరలోనే ఆర్టీసీ కార్గో సర్వీస్, హాస్పిటల్ సర్వీస్, ఇంటివద్దకే ఆర్టీసీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎండీ సజ్జనార్ వివరించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఆదివారాలు, పండుగల రోజుల్లో డ్యూటీలకు హాజరుకాలేదని.. 57 మంది డాక్టర్లకు మెమోలు జారీ

మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణలు

సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా కపిల్ సిబల్ నామినేషన్