చుట్టూ పులులు.. ఎటొచ్చి ఎప్పుడు దాడి చేస్తాయో.. కొండెక్కాలంటే వణుకుతున్న శ్రీవారి భక్తులు

చుట్టూ పులులు.. ఎటొచ్చి ఎప్పుడు దాడి చేస్తాయో.. కొండెక్కాలంటే వణుకుతున్న శ్రీవారి భక్తులు

ఏడు కొండలవాడా.. వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అని అలిపిరి మార్గంలో స్లోగన్స్ వినపడతాయి.  కాని కొంత కాలం  నుంచి ఏడు కొండల స్వామీ.. మెట్ల మార్గంలో చిరుతలు వస్తున్నాయి.. జాగ్రత్త అని  టీడీటీ అధికారుల హెచ్చరికలు చెవుల్లో రింగ్ రింగ్ మంటున్నాయి.  తిరుమల కాలినడక మార్గంలో చిరుతల అలజడి ఇప్పుడప్పుడే తగ్గేట్టు కనపడేలా లేదు.  టీడీటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆపరేషన్ చిరుత ప్రారంభించి.. కెమెరాలు,  బోన్ లు పెట్టారు.  అయితే తిరుమల నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాలకు తాజాగా మరో రెండు చిరుతల కదలికలు చిక్కాయి.. ట్రాప్‌ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. రెండు చిరుతల సంచారాన్ని గుర్తించారు. స్పెషల్‌ టైప్ క్వార్టర్స్ సమీపంలో ఒకటి.. నరశింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నరట్టు గుర్తించారు ఫారెస్ట్‌ అధికారులు. ఇక, రెండు చిరుతలను ట్రాప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. . ఈ రెండు చిరుతలను కూడా బంధించేందుకు ఆ ప్రాంతంలో  బోన్లు ఏర్పాటు చేయనున్నారు. 

ALSO READ :మా ఫ్లెక్సీలు తొలగిస్తే గొంతుకోసుకుంటా: టీడీపీ మాజీ కౌన్సిలర్ 

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన ఏడు కొండలపై చిరుతల వలన  ఓ బాలుడు చిరుత దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడగా.. మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్‌ చిరుతలో  ఇప్పటికే ఐదు చిరుతలను బంధించినా.. ఇంకా భక్తుల్లో భయాందోళనలు తొలగడం లేదు.. , జూన్‌ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28, సెప్టెంబర్‌ 6వ తేదీల్లో మొత్తం ఐదు చిరుతలను బంధించారు ఫారెస్ట్‌ అధికారులు.. ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోందని టీటీడీ చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి ప్రకటించిన మరుసటి రోజే మరో రెండు చిరుతల సంచారం కలకలం రేపుతోంది.