గంగులూరులో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

గంగులూరులో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా గంగులూరు అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. గంగులూరు పోలీస్​స్టేషన్​ సమీప అడవుల్లో మావోయిస్టుల సంచారం గురించి సమాచారం రావడంతో ఎస్పీ జితేంద్రయాదవ్.. డీఆర్జీ బలగాలను రంగంలోకి దించి మావోయిస్టుల కదలికలపై అన్వేషణ సాగించారు. 

ఈ క్రమంలో మావోయిస్టు దళం భద్రతా బలగాల రాకను గుర్తించి కాల్పులకు దిగింది. ఇరువర్గాల మధ్య కొంతసేపు కాల్పులు జరిగాయి. ఆ తర్వాత మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి వెళ్లారు. అనంతరం ఘటనా స్థలంలో భద్రతా దళాలు​ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి. అలాగే, 303 రైఫిల్స్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.