సావర్కర్ను అవమానిస్తే సహించం:ఉద్దవ్ ఠాక్రే

సావర్కర్ను అవమానిస్తే సహించం:ఉద్దవ్ ఠాక్రే

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  నా పేరు సావర్కర్ కాదు.... నేను ఎవరికీ క్షమాపణ చెప్పనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్‌ఠాక్రే మండిపడ్డారు. సావర్కర్ ను  అవమానించడం ఆపకపోతే..మహారాష్ట్రలో కాంగ్రెస్తో బంధాన్ని తెంచుకుంటామని హెచ్చరించారు. 

సావర్కర్ను అవమానిస్తే సహించం..

కాంగ్రెస్ తో జతకట్టింది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ తో తమ బంధం బీటలు వారేలా రాహుల్ గాంధీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. తాము సావర్కర్ ను దేవుడిలా భావిస్తామని..ఆయన్ను అవమానించడం ఆపేయాలని సూచించారు. సావర్కర్ ను అవమానిస్తే సహించమన్నారు. భారత్ జోడో యాత్రలో తామంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నామన్నారు. రాహుల్ గాంధీ లేదా తాము చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణకే అని చెప్పారు.