మహిళతో ముద్దు తెచ్చిన తంటా.. మంత్రి పదవికి రాజీనామా

మహిళతో ముద్దు తెచ్చిన తంటా.. మంత్రి పదవికి రాజీనామా
  • సారీ చెప్పినా ఆగని దుమారం.. 
  • తప్పని పరిస్థితుల్లో రాజీనామా ప్రకటించిన బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్ కాక్

లండన్: సహాయకురాలితో ముద్దు తెచ్చిన తంటా.. చివరకు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి పదవికి ఎసరుపెట్టింది. మహిళకు ముద్దులు పెడుతున్న ఫోటో మీడియాలో బయటకు రావడంతో దుమారం చెలరేగిన విషయ తెలిసిందే. కుటుంబ సభ్యులు కానివారితో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను సాక్షాత్తు మంత్రే కాలరాశారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ద సన్ టాబ్లాయిడ్ కవర్ పేజీ ఫోటో గత 24గంటలుగా మొత్తం ప్రపంచ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్ సరేసరి. ఫోటో తనదో కాదో తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్ కాక్ ఫోటోలో ఉన్నది నేనే.. అంటూ అంగీకరించారు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయాను.. సారీ.. అంటూ క్షమాపణలు కోరుతూ ప్రకటన చేశారు. 
బ్రిటన్ ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు మహిళతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆయన విమర్శకుల ఆరోపణలకు ఈ ఫోటో ద్వారా బలం చేకూరింది. కరోనా కట్టడి చర్యలకు సంబంధించిన అనేక కాంట్రాక్టులు తనకు నచ్చిన వారికి.. తన సన్నిహితులకే కట్టబెడుతున్నారన్న విమర్శలను  విపక్ష లేబర్ పార్టీ మరోసారి తెరపైకి తెచ్చి విమర్శలు తీవ్రం చేసింది. దీంతో రాజకీయ వేడిని చల్లార్చేందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మ్యాట్ హన్ కాక్ ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.