SSB నోటిఫికేషన్ విడుదల: టెన్త్, ఇంటర్ అర్హతతో 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

SSB నోటిఫికేషన్ విడుదల: టెన్త్, ఇంటర్ అర్హతతో 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది. 

మొత్తం ఖాళీలు: 233. 

విభాగాల వారీగా ఖాళీలు: హెడ్ ​​కానిస్టేబుల్ (స్టీవార్డ్) 2, హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) 197, హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) 29, హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ) 5. 

ఎలిజిబిలిటీ
హెడ్ ​​కానిస్టేబుల్ (స్టీవార్డ్):  గుర్తింపు పొందిన  బోర్డు నుంచి 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి క్యాటరింగ్, కిచెన్ మేనేజ్‌మెంట్‌లో కనీసం రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది పని 
అనుభవం ఉండాలి. 

హెడ్​ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో  12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. సంబంధిత ట్రేడులో రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. లేదా ఐటీఐ లేదా ఒకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏడాది సర్టిఫికెట్ కోర్సుతోపాటు సంబంధిత ట్రేడులో ఏడాది అనుభవం ఉండాలి.

హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ): గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెటర్నరీ, లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్‌లో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదా వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు లేదా యానిమల్ హస్బెండ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్​: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 21.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాటగిరీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 20.

సెలెక్షన్ ప్రాసెస్
స్టేజ్–I పీఈటీ & పీఎస్​టీ (శారీరక పరీక్షలు): పురుషులు 1.6 కి.మీ. పరుగును 6 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయాలి. మహిళలు 800 మీటర్ల పరుగును 4 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మాజీ సైనికులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు నిర్దేశించిన ఎత్తు, ఛాతీ ప్రమాణాలను (నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల వారీగా, కేటగిరీల వారీగా) కలిగి ఉండాలి.

స్టేజ్–I I  రాత పరీక్ష: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఓఎంఆర్ షీట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పార్ట్-–Iలో  జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/ జనరల్ హిందీ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. పార్ట్–-IIలో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు నుంచి 100  ప్రశ్నలు  100 మార్కులకు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు 50  శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

స్టేజ్-III స్కిల్ టెస్ట్: హెడ్ ​​కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 50 మార్కులు ఉంటాయి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. స్కిల్ టెస్ట్ మార్కులను తుది మెరిట్ జాబితాలో చేర్చరు.  

వైద్య పరీక్ష: చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ssb.gov.in ను సందర్శించండి.