కరోనా ట్యాబ్లెట్‌కు అమెరికా FDA ఆమోదం

కరోనా ట్యాబ్లెట్‌కు అమెరికా FDA ఆమోదం

న్యూయార్క్: మెర్క్‌ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా ట్యాబ్లెట్‌కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఎఫ్‌డీఏ కమిటీలో 13మంది సభ్యులు ట్యాబ్లెట్ వినియోగానికి మద్దతివ్వగా  పది మంది సభ్యులు ఈ ట్యాబ్లెట్‌ను వ్యతిరేకించారు. తక్కువ మెజారిటీతో ఈ ట్యాబ్లెట్‌కు ఆమోదం లభించింది.ఇంటి వద్దనే చికిత్స పొందే అవకాశంతో ఈ ట్యాబ్లెట్‌తో వచ్చింది. వయసు మళ్లిన వారిలో కరోనా బాగా ముదిరే అవకాశాలు ఉన్న రోగులు ఈ ట్యాబ్లెట్‌ వేసుకునేందుకు అనుమతించారు.

ఏయే వయసు వారు ఎప్పుడెప్పుడు ఎంతెంత డోసు వేసుకోవాలనేది కంపెనీ  తెలియజేస్తుంది. ఈ ట్యాబ్లెట్ పై  తాము జరిపిన పరిశోధనల్లో, క్లినికల్ ట్రయల్స్ లో కరోనాతో హాస్పిటల్‌లో చేరే అవకాశం, చనిపోయే అవకాశాలు 30 శాతానికి తగ్గిందని మెర్క్‌ కంపెనీ ప్రకటించింది. సుమారు 70 శాతం మంది ఈ ట్యాబ్లెట్‌ ను వాడి కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారని కంపెనీ తెలియజేసింది. ప్రపంచంలో కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రమాదకరంగా ఉందని, ఇలాంటి ట్యాబ్లెట్లు రావాల్సిన అవసరం ఉందని ఎఫ్ డి ఏ కమిటీ సభ్యుడు డాక్టర్‌ డేవిడ్‌ హార్డి అభిప్రాయపడ్డారు.