విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట  : విప్ ఆది శ్రీనివాస్

విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట  : విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి, వెలుగు: విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రూ.18.47 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా జరుగుతున్నాయని అన్నారు. గత కాంగ్రెస్ హయంలో రుద్రంగి, నాగారం చెరువు, మర్రిపల్లి ప్రాజెక్ట్, చందుర్తి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను పూర్తిచేశామన్నారు.

గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో వేములవాడలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అనంతరం రామన్నపేట, సనుగుల నుంచి వచ్చే విద్యార్థుల కోసం కాలేజీ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా.. వెంటనే డీఎంతో మాట్లాడారు. చందుర్తి– మోత్కరావుపేట రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు రుద్రంగి మండల కేంద్రంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.