విజ్ఞాన్ వర్సిటీ వీశాట్ నోటిఫికేషన్ విడుదల

విజ్ఞాన్ వర్సిటీ వీశాట్ నోటిఫికేషన్ విడుదల
  • దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25

హైదరాబాద్, వెలుగు: విజ్ఞాన్ యూనివర్సిటీ 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి వీశాట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వీశాట్ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఏ ఎల్ఎల్ బీ (ఆనర్స్), బీబీఏ ఎల్ఎల్ బీ (ఆనర్స్), బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, ఫార్మా డీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ డీన్ డాక్టర్ కేవీ. క్రిష్ణ కిషోర్ మాట్లాడారు. వీశాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్టణం, ఏలూరు, రాజమండ్రిలోని అన్ని విజ్ఞాన్ సంస్థలు, కార్యాలయాల్లోను అందుబాటులో ఉంటాయని తెలిపారు. విజ్ఞాన్ వర్సిటీ వెబ్ సైట్ admissions.vignan.ac.in ద్వారా కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 

మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల్లోను పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీశాట్ దరఖాస్తును ఫిబ్రవరి 25లోపు పూర్తి చేయాలన్నారు. వీశాట్ లో తొలి 50 ర్యాంకులు సాధించిన వారికి 50%, 51–200లోపు ర్యాంకుల వారికి 25%, 201–2000లోపు ర్యాంకులు సాధించినవారికి 10% ఫీజును స్కాలర్ షిప్ గా అందజేయనున్నట్టు పేర్కొన్నారు.