
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు న్యాయం చేయాలని క్వాలిఫైడ్ ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రవిశంకర్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 411 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ లోని జనరల్ విభాగంలో అందరినీ రెగ్యులరైజ్‌చేసి, ఒకేషనల్ విభాగంలో ఉన్న 411 మందిని వివిధ కారణాలతో పక్కన పెట్టిందన్నారు.
ఇటీవలే జూనియర్కాలేజీలకు కొత్తగా 273 పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఒకేషనల్ అధ్యాపకులను మరిచిపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. సంఘ ప్రతినిధులు హసీనా, గౌతం, చందు, రవి, ఆంజనేయులు, నగేశ్, శివానంద్, రామస్వామి, వంశీకృష్ణ, మల్లయ్య, శ్రీనివాస్, జ్యోతి, నర్సమ్మ పాల్గొన్నారు.