Bandla Ganesh: ఘనంగా బండ్ల గణేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి దంపతుల ఆశీస్సులు

Bandla Ganesh: ఘనంగా బండ్ల గణేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి దంపతుల ఆశీస్సులు

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం త్వరలో జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా చెందిన సూర్య తేజతో ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 3, 2026న) ఉదయం నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంప‌తులు, సుస్మిత కొణిదెల‌, సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు, కమెడియన్ బ్రహ్మానందం, నిర్మాత కోన వెంకట్, శ్రీను వైట్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం నిశితార్ద వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే నెటిజన్లు, సినీ తారలు బండ్ల గణేష్ కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ విష్ చేస్తున్నారు. త్వరలోనే ఈ వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు, తేదీలు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి 'ఈశ్వరా.. పరమేశ్వరా' అంటూ దేవుడిని నమ్ముకునే బండ్ల గణేష్ ఇంట ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతుండటంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.