కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల– కరీంనగర్ హైవే పై శనివారం రాత్రి మక్కల లోడుతో వెళుతున్న లారీ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు మక్కల లోడుతో వెళ్తున్న లారీ కొడిమ్యాల మండలం దొంగలమర్రి సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. క్షణాల్లోనే మంటలు లారీని కమ్మి వేయడంతో పాటు అందులోని మక్కల బస్తాలకు కూడా నిప్పంటుకుంది. దీంతో లారీ పూర్తిగా కాలిపోయింది. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది.
