ఆవిష్కరణలపై దృష్టి పెట్టండి.. ఉత్సవ్-2026 పేరుతో యాన్యువల్‌‌‌‌ డే

ఆవిష్కరణలపై దృష్టి పెట్టండి.. ఉత్సవ్-2026 పేరుతో యాన్యువల్‌‌‌‌ డే
  •  తిమ్మాపూర్  జ్యోతిష్మతి అటానమస్ కాలేజీలో ఉత్సవ్-2026 కార్యక్రమం

తిమ్మాపూర్, వెలుగు: ప్రజా సంక్షేమ, పర్యావరణ హితమైన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టిపెట్టాలని జేఎన్టీయూహెచ్‌‌‌‌ వీసీ కిషన్ కుమార్ రెడ్డి సూచించారు. కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్ మండలకేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కాలేజీలో శనివారం సాయంత్రం ‘ఉత్సవ్-2026’ పేరుతో యాన్యువల్‌‌‌‌ డేను గ్రాండ్‌‌‌‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జ్యోతిష్మతి కాలేజీకి మంచి పేరుందన్నారు. ఎన్‌‌‌‌ఐటీ వరంగల్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌బీవీ సుబ్రహ్మణ్యం, శాతవాహన రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌(పెద్దపల్లి) సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.