వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. బాలకృష్ణ మహరాణా నిర్మించారు. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. హారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు 50 మంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన కృష్ణసాయి బర్త్‌డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ ‘వరలక్ష్మీ శరత్‌కుమార్, నవీన్ చంద్ర కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం’ అని చెప్పాడు.
