నాగబాబు లీడ్ రోల్ లో మేము కాప్‌‌‌‌‌‌‌‌ లం వెబ్ సిరీస్..

నాగబాబు లీడ్ రోల్ లో మేము కాప్‌‌‌‌‌‌‌‌ లం వెబ్ సిరీస్..

నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ రూపొందుతోంది. గెటప్ శ్రీను,  రవితేజ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘విక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకుడు.  శనివారం టైటిల్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు. ‘మేము కాప్‌‌‌‌‌‌‌‌లం’ అనే వెరైటీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోడి పుంజును ఎత్తుకుని నాగబాబు,  పోలీస్‌‌‌‌‌‌‌‌ గెటప్స్‌‌‌‌‌‌‌‌లో గెటప్ శ్రీను, రవితేజ కనిపించారు. 

గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఓ ఘటనతో గందరగోళం ఏర్పడుతుంది.  ఆ కేసు విచారణ కోసం ఇద్దరు పోలీసులు వస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ  సిరీస్‌‌‌‌‌‌‌‌ మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌.  

రూరల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో అక్కడి రోజువారీ జీవితం,  స్థానిక రాజకీయాల నేపథ్యంలో కామెడీ, మిస్టరీ కలయికగా దీన్ని తెరకెక్కించినట్టు మేకర్స్‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు.  శోభన్ చిట్టుప్రోలు దీనికి కథను అందించారు.  బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మిస్తున్నారు.