ఇండియాలోకి వోక్స్‌వ్యాగన్‌ తైగున్‌.. కారు ప్రత్యేకతలివే

ఇండియాలోకి వోక్స్‌వ్యాగన్‌ తైగున్‌.. కారు ప్రత్యేకతలివే
  • భారత మార్కెట్లో రిలీజ్ కు ముందే హైదరాబాద్ కార్ల ప్రేమికుల కోసం ప్రత్యేక ప్రివ్యూ 

హైదరాబాద్: కార్ల ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వోక్స్ వ్యాగన్ భారత మార్కెట్లో లాంఛింగ్ కు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 23న భారత మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే రిలీజ్ కు ముందే తైగున్‌ అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాన్ని హైదరాబాద్ వాసులకు కల్పించింది. భారతదేశపు మార్కెట్‌లో ఆవిష్కరించక మునుపే హైదరాబాద్‌లోని కార్ల ప్రేమికులకు వోక్స్‌వ్యాగన్‌ తైగున్‌ ప్రత్యేక ప్రివ్యూ  ఏర్పాటు చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ ప్రత్యేక ప్రివ్యూ జరుగుతున్న నాల్గవ నగరంగా హైదరాబాద్‌ నిలువగా, దేశంలో ఈ ఎక్స్‌క్లూజివ్‌ ప్రివ్యూ జరుగుతున్న 5వ నగరంగా ముంబై నిలిచింది. తొలుత బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు తరువాత నాల్గవ మార్కెట్ గా హైదరాబాద్‌తో పాటుగా ఐదవ భారతదేశపు నగరంగా ముంబైలో ప్రత్యేకంగా తైగున్‌ ప్రివ్యూ నిర్వహించారు.
ఆన్ లైన్.. ఆఫ్ లైన్ బుకింగ్ ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఆధీకృత వోక్స్ వ్యాగన్‌ డీలర్ల వద్ద, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ముందస్తు బుకింగ్ ప్రారంభించినట్లు వోక్స్‌వ్యాగన్‌ ఇండియా ప్రకటించింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌ కింద  బ్రాండ్‌ ఆవిష్కరించిన మొట్టమొదటి ప్రొడక్టుగా వోక్స్‌ వ్యాగన్‌ తైగున్‌. శక్తివంతమైన ఉనికి, ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్స్‌, ప్రీమియం ఇంటీరియర్స్‌, డిజిటల్‌ కాక్‌పిట్‌, భద్రత మరియు సమాచార, వినోద ఫీచర్లతో మిడ్‌ సైజ్‌ ఎస్‌యువీడబ్ల్యును ఎంక్యుబీ ఏఓ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది.
కారు ప్రత్యేకతలు
టీఎస్‌ఐ ఇంజిన్‌ సాంకేతికతతో శక్తివంతమైన తైగున్.
 7 స్పీడ్‌ డీఎస్‌జీతో రూపుదిద్దుకున్న 1.5 లీటర్‌ ఇంజిన్‌.
6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌

6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ మరియు మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో కలగలిసిన 1.0 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌తో లభ్యం
ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్స్‌, డిజిటల్‌ కాక్‌పిట్‌
40కు పైగా భద్రతా ఫీచర్లతో సహా ప్రీమియం ఇంటీరియర్స్‌ 
డ్రైవింగ్, ప్రయాణం చాలా ఆహ్లాదకర అనుభవం కలిగించే డీఎన్‌ఏ, టీఎస్‌ఐ సాంకేతికత.