భారతీయులకు వాల్ మార్ట్ బంపర్ ఆఫర్

V6 Velugu Posted on Jan 21, 2022

హైదరాబాద్​, వెలుగు: తమ ప్లాట్​ఫారమ్​ ద్వారా అమెరికా మార్కెట్లో సరుకులను అమ్మడానికి  దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్​ సెల్లర్లను వాల్‌‌మార్ట్ కోరింది. వాల్‌‌మార్ట్ మార్కెట్‌‌ప్లేస్‌‌ ద్వారా ప్రతి నెలా 120 మిలియన్లకుపైగా అమెరికా షాపర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపింది.  ఇందుకోసం ఇండియన్​ సెల్లర్లు తమ డెలివరీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను వాడుకోవచ్చని తెలిపింది. 2027 నాటికి భారతదేశం నుండి 10 బిలియన్​ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించాలనే టార్గెట్​తో పనిచేస్తున్నట్టు తెలిపింది. ఇండియన్​ సెల్లర్లు అమెరికా కస్టమర్లను చేరుకునేలా వారికి సహాయపడేందుకు ప్రత్యేకంగా క్రాస్​బోర్డర్​ ట్రేడ్​ టీమ్​ను ఏర్పాటు చేశామని​ పేర్కొంది.
 

Tagged america, usa, sale, sell, Indians, offer, Goods, Wal-Mart

Latest Videos

Subscribe Now

More News