V6 News

క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ బ్రౌజర్లు వాడుతున్నారా.. హిస్టరీని ఇలా డిలేట్ చేస్తేనే సేఫ్..

 క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ బ్రౌజర్లు వాడుతున్నారా.. హిస్టరీని ఇలా డిలేట్ చేస్తేనే సేఫ్..

ఈ రోజుల్లో మనం ఏ పని కోసం అయినా ఎక్కువగా ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే ఏదైన వెబ్‌సైట్‌ చూసే విధానంలో ఈ బ్రౌజర్ ఆక్టివిటీ  చాలా ముఖ్యం. మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి సెర్చ్, ప్రతి విజిట్ ఒక డిజిటల్ ఆనవాల్లను వదిలివేస్తుంది. చాలా బ్రౌజర్‌లు ఈ ఆక్టివిటీని డిఫాల్ట్‌గా  స్టోర్  చేస్తాయి. ఈ హిస్టరీ వల్ల మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుండి మళ్లీ మొదలు పెట్టడానికి వీలు అవుతుంది. అయితే, మీరు ఇతరులతో షేర్ చేసుకునే  లేదా పబ్లిక్  డివైజెస్‌లో  ఇది ప్రైవసీ సమస్యలను పెంచుతుంది. మీరు వాడే   బ్రౌజర్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని డిలేట్ చేయడానికి, మీ డేటా ఇతరులు చూడకుండా లేదా ట్రాక్ చేయకుండా ఆపడానికి ఈ  ఈజీ  టిప్  ఫాలో అవ్వండి....

 గూగుల్ క్రోమ్‌:
గూగుల్ క్రోమ్ మీరు విజిట్ చేసిన వెబ్‌సైట్‌, డౌన్‌లోడ్‌ ఇతర ఆక్టివిటీని స్టోర్ చేస్తుంది. మీరు దీన్ని కొన్ని సింపుల్ స్టెప్స్‌లో డిలేట్  చేయవచ్చు:
*ఇందుకు మొదట క్రోమ్‌ని ఓపెన్ చేయండి.
*కుడి వైపున పై భాగంలో ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.
*హిస్టరీని సెలెక్ట్  చేయండి.
*clear browsing data పై నొక్కండి.
మీరు క్లియర్ చేయాలనుకుంటున్న టైమ్ రేంజ్‌ని సెలెక్ట్ చేసి (ఉదాహరణకు last 1 hour, last 24 hours లేదా delet all history) డేటాను క్లియర్ చేయిపై  సెలెక్ట్ చేయండి.

 మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌:
ఫైర్‌ఫాక్స్‌లో యూజర్‌లకు  స్టోర్ చేసిన డేటాపై పూర్తి కంట్రోల్  ఉంటుంది. దాన్ని క్లియర్ చేయడానికి:
*ముందు ఫైర్‌ఫాక్స్‌  ఓపెన్ చేయండి.
*ఇప్పుడు మెనూ బటన్‌ క్లిక్ చేసి హిస్టరీని సెలెక్ట్ చేయండి. 
*రీసెంట్ హిస్టరీ  క్లియర్ చేయిపై క్లిక్ చేయండి.
మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న హిస్టరీ  కోసం చెక్ బాక్స్‌ క్లిక్ చేసి........., ఉదాహరణకు: బ్రౌజింగ్ హిస్టరీ, డౌన్‌లోడ్ హిస్టరీ, కుకీలు, లేదా సైట్ డేటా ఫినిష్ చేయడానికి  ఓకే క్లిక్ చేయండి.

 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌:
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్‌లు కూడా స్టోర్ చేసిన ఆక్టివిటీని ఈజీగా మేనేజ్ చేయవచ్చు:
*ముందు ఎడ్జ్‌ని ఓపెన్ చేయండి.
*ఇప్పుడు మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.
*హిస్టరీని సెలెక్ట్ చేయండి. 
*డిలీట్ ఆప్షన్‌ క్లిక్ చేసి ఎం క్లియర్ చేయాలో సలెక్ట్ చేసి  క్లిక్ చేయండి.

సఫారీలో హిస్టరీ

*సఫారీ యూజర్‌లు మెనూ బార్‌ను ఉపయోగించి డేటాను డిలీట్ చేయవచ్చు:

*ఇందుకు సఫారీని ఓపెన్ చేయండి.

*హిస్టరీకి వెళ్లి, హిస్టరీని క్లియర్ చెయ్ క్లిక్ చేయండి. 
*టైమ్ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకోండి .
క్లియర్ హిస్టరీని సలెక్ట్ చేసుకున్నాక కన్ఫర్మ చేయండి.

ఒపెరాలో హిస్టరీ:
*ఒపెరాలో, ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. 
*ముందుగా ఒపెరాను ఓపెన్ చేయండి.
*సైడ్‌బార్‌లోని క్లాక్ ఐకాన్‌పై  క్లిక్ చేయండి.
*బ్రౌజింగ్ డేటా  క్లియర్ పై నొక్కండి. 
డిలీట్ చేయాల్సిన టైమ్ రేంజ్, డేటాను సెలెక్ట్ చేసుకోండి .

సింపుల్ గా  చెప్పాలంటే, మీ డివైజెస్‌లు సరిగ్గా పనిచేయడానికి, ట్రాకింగ్‌ తగ్గించడానికి, స్టోర్ చేసిన బ్రౌజర్ డేటాను రెగ్యులర్‌గా డిలీట్ చేయడం చాలా ముఖ్యం.కుకీలు ఎక్కువ కాలం ఉండే కొద్దీ, అవి స్టోరేజీ ఎక్కువ తీసుకుంటాయి. కాబట్టి, వాటిని క్లియర్ చేయడం వల్ల బ్రౌజర్ వేగం స్థిరంగా ఉంటుంది.