ఎవరైనా సెలెబ్రిటీలు, ప్రముఖులు సాధారణంగా పెళ్లిళ్లకు, ఉరేగింపులకు పోలీస్ సెక్యూరిటీ తీసుకుంటుంటారు. ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటనలు, గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త కోసం... కానీ పెళ్ళికొడుకు గుర్రపు ఊరేగింపు కోసం పోలీసులు అందరు కలిసి భద్రత కల్పించడం ఎక్కడైన చూసారా...
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ రాజీవ్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాపురా చౌకాలో ఉండే బాబా రామ్‌దేవ్ కాలనీలో ఆదివారం రోజున ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. వరుడు గుర్రంపై కూర్చుని వెళ్తుంటే పోలీసులు బందోబస్తుగా గట్టి రక్షణ కల్పించారు. అది కూడా డీపీఎస్ బైపాస్‌లోని రిసార్ట్ వరకు ఈ పెళ్లి వేడుక ఊరేగింపు భారీ పోలీసుల భద్రత మధ్య జరిగింది.
సమాచారం ప్రకారం, విషయం ఏంటంటే ఓ కాలనీలో ఉండే విక్రమ్ మేఘ్వాల్ పెళ్లి నిన్న ఆదివారం జరిగింది. కానీ పెళ్ళికి ముందు మధ్యాహ్నం 12 గంటలకు పెళ్ళికొడుకు అన్నయ్య నరేంద్ర పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. మొదట ఏంటి అని అనుకున్న పోలీసులు తరువాత ఉన్నత అధికారుల అనుమతితో రంగంలోకి దిగారు. అతని కంప్లైంట్లో వరుడు గుర్రంపై కూర్చోవడాన్ని అడ్డుకునేందుకు కొంతమంది గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉందని భయపడుతున్నట్లు తెలిపారు.
►ALSO READ | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం..10 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు.. వారంలో రెండోసారి..
ఈ కంప్లైంట్ విషయాన్ని పోలీస్ కమిషనర్ కి తెలియజేశారు. దింతో ఆయన ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వరుడి ఇంటికి ఒక్కసారిగా చేరుకున్నారు. దింతో రాత్రి సమయంలో వరుడు తన ఇంట్లో తయారై, గట్టి పోలీసు రక్షణ మధ్య గుర్రంపై కూర్చోగా పెళ్లి ఊరేగింపు భారీ భద్రత మధ్య మొదలైంది. ఈ ఊరేగింపు చుట్టూ కూడా పోలీసులు పహారా వేశారు. ఈ భద్రత మధ్య వరుడి ఊరేగింపు చివరికి పెళ్లి ప్రదేశమైన ఓ రిసార్ట్‌కు చేరుకుంది. దింతో వరుడి కుటుంబీకులు, బంధువులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు రావడంతో వరుడు ఉండే కాలనీ ఒక్క క్షణంలో సైనిక స్థావరంగా మారింది. వరుడు గుర్రంపై స్వారీ చేయకుండా ఎవరైనా అడ్డుకుంటారేమో అనే భయంతో మహిళా కానిస్టేబుల్స్‌తో సహా పోలీస్ బలగాలు, పెట్రోలింగ్ యూనిట్ నుండి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి వచ్చారు. దింతో ఒక్క క్షణంలో ఆ కాలనీ అంతా సైనిక స్థావరం (కంటోన్మెంట్) లాగా మారిపోయింది.
కారణం ఏంటంటే : వరుడు గుర్రంపై ఊరేగడాన్ని కొంతమంది గ్రామస్తులు అడ్డుకుంటారేమో అనే భయంతో కుటింబికులు పోలీసులు ఆశ్రయించారు. గతంలో కొన్ని గొడవల కారణం ఇక్కడ గుర్రంపై వరుడి ఊరేగింపు వివాదాల్లో చిక్కుకుంది. పెళ్ళి మండపం వరకు వరుడు గుర్రంపై ఊరేగింపుగా వెళ్లడం అనేది వీళ్ళ ఆచారం. అయితే దీనిని ఎవరైనా అడ్డుకుంటారేమో అని భయంతో చివరి నిమిషంలో పెళ్లి కొడుకు అన్నయ పోలీసులను ఆశ్రయించాడు.
