అవార్డును ఆదివాసీ సమాజానికి అంకితం చేస్తా: గుస్సాడీ కనకరాజు

V6 Velugu Posted on Oct 18, 2021

కొమ్రంభీం జిల్లా జైనూర్ మండలానికి చెందిన గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చింది. వచ్చే నెల9న రాష్ట్రపతి భవన్ లో పద్మ శ్రీ అవార్డు అందుకోవడానికి రావాలని అధికారులు లెటర్ పంపారు. దీపావళి పండుగ ఉత్సవాల సమయంలో అవార్డు తీసుకోవడం తన అదృష్టమన్నారు కనకరాజు. తన అవార్డును ఆదివాసీ సమాజానికి అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలను, ప్రకృతిని  కాపాడాలని పిలుపు ఇచ్చారు. 
 

Tagged dedicated, Padma Sri Award, , Tribal community, Gussadi artist Kanakaraju

Latest Videos

Subscribe Now

More News