
- జనగామ జిల్లాకు చెందిన మహిళను మోసగించిన సైబర్ ఫ్రాడ్స్
జనగామ, వెలుగు : కాంట్రాక్ట్ జాబ్ఇప్పిస్తామని ఓ మహిళను నమ్మించి రూ. 40 వేలు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విడుదలైన ఎంల్ హెచ్‌పీ నోటిఫికేషన్చూసి జనగామ జిల్లాకు చెందిన ఓ మహిళ అప్లై చేసుకుంది. కొద్ది రోజుల కింద డీఎంహెచ్ఓ ఆఫీస్నోటీస్బోర్డుపై ప్రొవిజినల్లిస్ట్ పెట్టడడంతో పాటు ఆన్లైన్ లోనూ అందుబాటులో ఉంచారు. కాగా.. ఆ మహిళకు సైబర్ఫ్రాడ్స్ ఫోన్‌చేసి.. మెరిట్లిస్ట్లోమీ పేరు ఫైనల్చేస్తున్నామని, అందుకు రూ. 2 లక్షలు ఆన్లైన్ట్రాన్స్ఫర్చేయాలని సూచించారు.
అంత డబ్బు లేదని ఆమె చెప్పగా.. వెంటనే రూ. 20 వేలు ట్రాన్స్ ఫర్ చేసి.. మిగతావి తర్వాత ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆమె మంగళవారం రూ. 40 వేలు పలుమార్లు కాల్ చేసిన నంబర్ కు ట్రాన్స్ఫర్చేసింది. బుధవారం ఆమె జనగామ డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు వెళ్లి జాబ్ పై అడగడంతో అసలు విషయం తెలిసింది. తాను మోసపోయానని అధికారులను అడిగితే.. తామేమి చేయలేమని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించగా బాధితురాలు వెళ్లిపోయింది. ఇన్ చార్జ్డీఎంహెచ్ఓ రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ.. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఎవరూ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని కోరారు.