V6 News

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు: మహిళలు అన్ని  రంగాల్లో ముందుండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేతలు  సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా మహిళలు రాజకీయాలలో రాణించాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లు, ఆర్టీసీ బస్సులకు యజమానులు చేశారని చెప్పారు. ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా మహిళల పేరుతో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ఆడపిల్లలు గొప్పగా చదువుకోవాలని ఆలోచనతో  ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ బీజెపి  మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ తో ముడి పెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ మహాలక్ష్మి, సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులురాలు వెన్నం రజిత రెడ్డి, పూదరి రేణుక గౌడ్, వసంతలక్ష్మి, చంద్రకళ, లావణ్య, హసీనా, పద్మ తదితరులు పాల్గొన్నారు.