రాజకీయాల్లో మహిళలు భాగస్వామ్యం కావాలి..కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్

రాజకీయాల్లో మహిళలు భాగస్వామ్యం కావాలి..కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్

వికారాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అత్యధికంగా మహిళల పేరుతోనే ఉన్నాయని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర  అధ్యక్షురాలు మొగిలి సునీతా ముదిరాజ్ అన్నారు. సోమవారం వికారాబాద్​ అంబేద్కర్ భవనంలో జరిగిన జిల్లా మహిళా కాంగ్రెస్​ ఎగ్జిక్యూటివ్  కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వికారాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జై బాపు, జై భీమ్​, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. 

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో సునీత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకొని పార్టీలోని మహిళలు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు సంతోష రాజు మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలో మహిళలు పోటీకి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎస్సీ సెల్ ​అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.