
చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం షావోమి (Xiaomi) విమర్శలతో వార్తల్లోకి ఎక్కింది. ఇందుకు కారణం, కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన 'ఎస్‌యూ 7' (Su 7) ఎలక్ట్రిక్ సెడాన్ కారు క్రాష్ అయినప్పుడు డోర్లు తెరుచుకోకపోవడం. చైనాలోని చెంగ్డులో జరిగిన ఈ ప్రమాదంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కార్లలో ఉండే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఎంతవరకు సేఫ్ ? వాటికి మాన్యువల్‌గా అంటే చేతితో డోర్స్ ఓపెన్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గం ఎందుకు అవసరం లేదో అనే ప్రశ్నలను నిపుణులు లేవనెత్తుతున్నారు.
షావోమి ఎస్‌యూ 7 కారు ప్రమాదం: సమాచారం ప్రకారం, షావోమి ఎస్‌యూ 7 కారు ప్రమాదం తర్వాత మంటల్లో చిక్కుకుంది. కారులో ఉన్న ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ కారణంగా అక్కడ ఉన్న వాళ్ళు కార్ తలుపులు తెరవలేకపోయారు. దింతో కారు నడుపుతున్న వ్యక్తి మంటల్లో ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు మంటలు అంటుకోవడం, కార్ డోర్ ఓపెన్ కాకపోవడం కారణంగా అతను ప్రాణాలతో బయటపడలేకపోయాడు.
ఈ ప్రమాదానికి డ్రైవర్ మద్యం సేవించి ఉండటం మరొక కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే, కారులో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ వల్లే ఇలాంటి సమయంలో డోర్లు తెరుచుకోకుండా ఉండవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌యూ 7 కారుకు డోర్ హ్యాండిల్స్ దొరుకు సమానంగా ఉండి, ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేస్తాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ సిస్టం పాడైపోవడం వల్లే డోర్లు జామై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ విషాదకర ఘటన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ - EV) భద్రతా ప్రమాణాల గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది. టెస్లా, బీవైడీ, షావోమి వంటి కంపెనీలు తయారుచేసే సంక్లిష్ట ఎలక్ట్రానిక్స్ ఉన్న కార్లపై దృష్టి పెడుతున్నారు. ఆవిష్కరణలు (ఇన్నోవేషన్స్) భద్రత (సేఫ్టీ) ను పణంగా పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఎప్పుడైనా విఫలమైనా (పనిచేయకపోయినా) డోర్లు తెరవడానికి వీలుగా మాన్యువల్ ఓవర్‌రైడ్‌లు తప్పనిసరిగా ఉండాలని వారు నొక్కి చెబుతున్నారు.