యాదాద్రి, వెలుగు: డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా పెట్టాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నందున స్కూల్స్, కాలేజీలతో పాటు వివిధ ఫ్యాక్టరీల వద్ద నిఘా వేయాలన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించి డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్ర్పరిణామాలను వివరించాలని ఆదేశించారు. ఎస్సీ ఆక్షాంక్ష్ యాదవ్, ఎక్సైజ్ ఎస్పీ విష్ణుమూర్తి, ఆర్డీవో కృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఈవో సత్యనారాయణ ఉన్నారు.

