యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ

యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ

యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. పంచ నారసింహ ఆలయ ఉద్ఘాటనకు శ్రీకారం చుట్టారు అర్చకులు. బాలాలయంలోని యాగశాలలో పంచకుండాలతో యాగాన్ని ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచ కుండాత్మక మహాయాగంలో భాగంగా బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం 108 కలశాలను అలంకరించి,  108 దేవతారాధనలు జరిపి విశిష్ట అభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు. విశ్వక్సేనుడి తొలిపూజ పుణ్యాహవచనంతో ప్రధాన ఆలయ ఉద్ఘాటన ప్రారంభమైంది. రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలను మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన, అష్టదిక్పాలకుల ప్రతిష్ఠాపర్వం చేపడతారు.

 

 

 

ఇవి కూడా చదవండి

రాఖీభాయ్ ‘తూఫాన్’ షురూ

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్