తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి జీవో రిలీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, SPF, జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు విద్య అందించనుంది ప్రభుత్వం. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయనుంది.
వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి
త్వరలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 19న సీఎం రేవంత్ చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్లో పోలీస్ పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉండనుందని, ఫస్ట్ విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రారంభిస్తామని చెప్పారు. పోలీసులు చేసేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని అన్నారు. రాష్ట్ర సాధనలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.