హరీశ్ రావుకు నిరసన సెగ

హరీశ్ రావుకు నిరసన సెగ

వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని... త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఫీవర్ హాస్పిటల్ లో కొత్త OPD బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ లో పర్యటించారు. 13 హెర్సి వెహికల్స్, 3 అంబులెన్సులను మంత్రి ప్రారంభించారు. హాస్పిటల్ కు పేషెంట్ల సంఖ్య పెరగుతుందన్నారు. అందుకే కొత్త OPD బ్లాక్ ను నిర్మాణం చేపట్టామని తెలిపారు.

హైదరాబాద్ నల్లకుంటలో మంత్రి హరీశ్ రావుకు నిరసన సెగ తలిగింది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కు వస్తున్న హరీశ్ కాన్వాయ్ ను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాలంటూ నిరసనకు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక విద్యార్ధులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఫైర్ అయ్యారు నేతలు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే మంత్రులెవరినీ రాష్ట్రంలో తిరగనివ్వమన్నారు హెచ్చరించారు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్.