సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 23.
ఖాళీలు: ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్/ సబ్ స్టాఫ్, వాచ్మెన్ కం గార్డ్నర్.
నిర్దిష్ట పోస్టుల సంఖ్యను పేర్కొనలేదు.
ఎలిజిబిలిటీ
ఆఫీస్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి బీఎస్‌డబ్ల్యూ/ బీఏ/ బి.కాం.తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
అటెండర్/ సబ్ స్టాఫ్: పదోతరగతి పూర్తిచేసి ఉండాలి. స్థానిక భాషలో మాట్లాడగలగాలి.
వాచ్మెన్ కం గార్డ్నర్: ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్/ గార్డెనింగ్/ హార్టికల్చర్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి (2026, జనవరి 31 నాటికి)
కనీస వయసు: 22 ఏండ్లు.
గరిష్ట వయసు: 40 ఏండ్లు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 23.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు centralbank.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
