తెలంగాణ జైళ్లలో ఉన్నది.. అత్యధికంగా 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లే..

తెలంగాణ  జైళ్లలో  ఉన్నది.. అత్యధికంగా 18 నుంచి  30 ఏళ్ల లోపు వాళ్లే..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న వారే అత్యధికంగా ఉన్నారని  జైళ్ల శాఖ డిజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు.  2025లో 19,413 మంది ఉంటే.. ఈ ఏడాది 31నుంచి50 ఏళ్ల వయస్సు ఉన్న  ఖైదీలు 19,318 మంది ఉన్నారని తెలిపారు.- మహిళా ఖైదీలు 2024లో మొత్తం 2,785 మంది మహిళలు ఉండగా, 2025లో ఆ సంఖ్య 2,880 కి పెరిగిందన్నారు.

జైళ్లలో పెరిగిన అడ్మిషన్లు

గత సంవత్సరం వార్షిక నివేదిక తో పాటు  ప్రస్తుత సంవత్సరం ప్రణాళిక లపై జైళ్ల శాఖ డీజీ  సౌమ్య మిశ్రా  వెల్లడించారు. ఈ ఏడాది జైలుల్లో  ఖైదీల అడ్మిషన్లలో 11.8శాతం పెరిగాయి.  అందులో ఎక్కువగా సైబర్ నేరాలు, డ్రంక్ & డ్రైవ్ కేసులలో అధికంగా ఉన్నారు.  2024లో 34 వేల811 మంది ఖైదీలు ఉండగా, 2025 నాటికి 36 వేల 627 మంది ఖైదీలు ఉన్నారు.  2024లో 3,229 మంది ఖైదీలు ఉండగా, 2025లో 5,856 మంది ఖైదీలకీ శిక్షి పడింది.   సివిల్ కేసుల్లో 20 మందికి ఖైదీలు వచ్చారు .   సైబర్ నేరాల్లో 2024 లో 757  ఖైదీలు 2025లో 1,784 ఖైదీలుగా ఉన్నారు.  డ్రంక్ & డ్రైవ్ కేసులో 2024లో 1,124  మంది ఖైదీలు 2025లో  2,833 ఖైదీలు ఉన్నారు.   మాదకద్రవ్యాల కేసులో 2024లో 6,311 మంది ఖైదీలు ఉండగా ఈ ఏడాది  7,040 మంది ఖైదీలు ఉన్నారు.  పోక్సో  చట్టం  కేసులో 2024  3,750 మంది ఖైదీలు ఉండగా 2025 లో 4,176  ఖైదీలు ఉన్నారు.  ఆస్తి నేరాల కేసులో 2024లో 7,679 మంది ఉండగా 2025లో 7,792  మంది ఖైదీలు ఉన్నారు. సైబర్ నేరాలు,డ్రంక్ & డ్రైవ్ కేసులు రెట్టింపు అయ్యాయి.

ఖైదీలకు వడ్డీలేని రుణాలు

దేశంలోనే ఖైదీలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2025లో 58 మంది ఖైదీలకు 18.66 లక్షల రుణాలు ఇప్పించాము. ఇప్పటివరకు 616 మందికి రూ.1.92 కోట్ల రుణాల పంపిణీ చేశాము.  2025లో 301 మందికి పరోల్ ఇచ్చాము.  218 మందికి జీవిత ఖైదీల ముందస్తు విడుదలకు స్పష్టమైన మార్గదర్శకాలను సిద్దం చేశాం . జైలులో చేరగానే తప్పనిసరి వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. 1,461 మందికి డయాబెటిస్, 1,225 మందికి బీపీ గుర్తింపు ఉన్నట్లు గుర్తించాం.  379 మంది ఖైదీలకు శస్త్రచికిత్సలు చేపించాము.  17 మంది గర్భిణీ ఖైదీలకు సురక్షిత ప్రసవాలు చేశాము.  6,573 మందికి లీగల్ ఒపీనియన్ అందించాము. ఈ ఏడాది 3,634 మంది విడుదల చేశాము.  జైల్ అదాలత్‌ల ద్వారా 985 మంది విడుదల చేశాము.  23,220 మంది ఖైదీలు అక్షరాస్యులు  ఉంటే 4,615 మందికి స్కిల్ శిక్షణ ఇప్పించాము. 
ఖైదీలకు రూ.1.63 కోట్ల వేతనాలను చెల్లించాము అని వెల్లడించారు