ఉత్తరాఖండ్​లో విషాదం

ఉత్తరాఖండ్​లో విషాదం

లక్నో: ఉత్తరాఖండ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా ద్రౌపది కా దండా– 2 శిఖరం వద్ద మంచు చరియలు విరిగిపడి 10 మంది ట్రైనీ మౌంటెయినీర్స్ మృతిచెందారు. ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెయినీర్ ఇనిస్టిట్యూట్(ఎన్ఐఎమ్)కు చెందిన 41 మంది ద్రౌపది దండా పర్వతారోహణకు వెళ్లారు. వారిలో 34 మంది ట్రైనీలు, ఏడుగురు ఇన్ స్ట్రక్టర్లు ఉన్నారు. మంగళవారం తిరిగి వస్తుండగా వారంతా అవలాంచిలో చిక్కుకున్నారని ఎన్ఐఎమ్ ప్రిన్సిపల్ కల్నల్ అమిత్ బిష్త్ తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారని..అందులో నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన వెల్లడించారు. వారిలో 8 మందిని కాపాడామని డిజాస్టర్ మెనేజ్ మెంట్ ఆఫీసర్ తెలిపారు.