లక్షల మందికి ఉద్యోగాల్లేవ్..వేల కోట్ల మద్యం అమ్మకాలా?

లక్షల మందికి ఉద్యోగాల్లేవ్..వేల కోట్ల మద్యం అమ్మకాలా?
  • అసలు రాష్ట్రం ఎటు వెళుతోంది..?
  • దీనికోసమేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది..?
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా: రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలతో బానిసలుగా  మారుతుంటే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నివారించడంలో విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పిరికిపందలు చేసే హీనమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. 
బండి సంజయ్ ఓకే అన్నారు.. ప్రభుత్వం తరపున కేటీఆర్ నిలబడాలి
రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కి బీజేపీ నాయకులు బండి సంజయ్ ఒకే చేశారు.. కేటీఆర్ నువ్ ప్రభుత్వం తరపున  నిలబడు.. అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. సాయంత్రం అయితే నువ్ ఎక్కడ ఉంటావో అందరికి తెలుసు అని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడని ఆయన ఆరోపించారు. లక్షలాది నిరుద్యోగులు రోడ్డుపై పడ్డారు, నిరుద్యోగ భృతి లేదన్నారు. కరోనా వలన 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.. మరో వైపు లక్ష కోట్ల మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయంటే.. రాష్ట్రం ఎటు వెళుతోందసలు..? ఏ ఊరు వెళ్లినా మద్యం మాత్రం దొరుకుతోంద.. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నది...? అని ఆయన ప్రశ్నించారు. పప్పు దినుసులు, నూనె గింజలకు మద్దతు ధర ప్రకటించాలని, షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ఓపెన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.