
జమ్ము కశ్మీర్ లో వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. శుక్రవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో .. ఈ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కశ్మీర్ కు రూపొందించిన ప్రత్యేక హక్కుల చట్టాన్ని 77వ రాజ్యాంగ ముసాయిదాకు కొన్ని మార్పులు చేసిందన్నారు. 2019 చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ ప్రమోషన్లలో లభ్ది చేకూరనుందన్నారు.