తొడ కండరాలను పీకేసి.. 10 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

తొడ కండరాలను పీకేసి.. 10 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

కుత్బుల్లాపూర్ : ఇటీవల గ్రామాలు, నగరంల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా గాజులరామారం, చెన్నకేశవ నగర్ వీధి కుక్కలు మరోసారి దాడి చేశాయి. ఇంటిముందున్న 10 ఏళ్ల బాలిక అన్విత పై వీధి కుక్కల దాడి చేశాయి. వీధి కుక్కలు బాలిక కుడి తొడను తీవ్రంగా గాయపరిచాయి.   

పాల ప్యాకెట్ కోసం ఉదయం షాపు కు వెళ్ళే క్రమంలో వీధి కుక్కలు దాడి చేశాయి. వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ అన్విత  పెద్దగా కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు తనను కుక్కల దాడి నుంచి కాపాడారు. దాంతో ఆ పాపకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. కుక్కల దాడిలో అన్విత కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు. తమ వీధిలో కుక్కలు బెడద అధికంగా ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్విత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.