ఇవాళ(సెప్టెంబర్3) సైదాబాద్‌‌‌‌‌‌‌‌- నల్గొండ Xరోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ(సెప్టెంబర్3) సైదాబాద్‌‌‌‌‌‌‌‌- నల్గొండ Xరోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఫ్లై ఓవర్ ​ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు : నల్గొండ ఎక్స్‌‌‌‌‌‌‌‌రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్​రెడ్డి గురువారం ప్రారంభించనున్న నేపథ్యంలో సైదాబాద్ -నల్గొండ ఎక్స్‌‌‌‌‌‌‌‌రోడ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైతే సహాయం కోసం హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు.

నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సంతోష్ నగర్, ఐఎస్ సదన్ వైపు..

నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద టర్న్​తీసుకుని మలక్‌‌‌‌‌‌‌‌పేట్ గంజ్ – మూసారాంబాగ్ ఎక్స్ రోడ్,  గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ (కుడి మలుపు)  రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, శివగంగ థియేటర్, హనఫియా మసీదు (రైట్​టర్న్) సంకేశ్వర్ బజార్, సింగరేణి కాలనీ (లెఫ్ట్​టర్న్) ,  ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేట్ (లెఫ్ట్​టర్న్) , చంపాపేట్ మెయిన్ రోడ్డులో యూ-టర్న్ , చంపాపేట్ ఎక్స్ రోడ్ (లెఫ్ట్​టర్న్) , లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా డీఎమ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్ రోటరీ వైపు వెళ్లాల్సి ఉంటుంది.  

ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వైపు..

సైదాబాద్ వై జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని డీసీపీ 3 ఆఫీసు, సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్ , సరస్వతి నగర్ కమాన్ , సంకేశ్వర్ బజార్ , ఇండియన్ పెట్రోల్ బంక్ , హనఫియా మసీదు దగ్గర లెఫ్ట్​టర్న్, గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ దగ్గర లెఫ్ట్​టర్న్​తీసుకుని నల్గొండ ఎక్స్ రోడ్ చేరుకోవాలి.

మీర్‌‌‌‌‌‌‌‌చౌక్ నుంచి డబీర్‌‌‌‌‌‌‌‌పురా బ్రిడ్జి మీదుగా సైదాబాద్ వై జంక్షన్ వైపు..

ట్రిబ్యునల్ కోర్ట్ వద్ద మళ్లింపు ఉంటుంది. డబీర్‌‌‌‌‌‌‌‌పురా కమాన్, షేక్ ఫయాజ్ కమాన్ దగ్గర రైట్​టర్న్​, గంగా నాలా , బడా బజార్, యాకుత్‌‌‌‌‌‌‌‌పురా ఆర్‌‌‌‌‌‌‌‌యుబీ ,  82 బస్ స్టాప్ , మాదన్నపేట మండీ,  సంతోష్ నగర్ మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలి. 

డబీర్‌‌‌‌‌‌‌‌పురా కమాన్ నుంచి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ ఎక్స్ రోడ్ మీదుగా మలక్‌‌‌‌‌‌‌‌పేట్ వైపు..

ట్రిబ్యునల్ కోర్ట్ వద్ద మళ్లింపు ఉంటుంది. దారుల్‌‌‌‌‌‌‌‌షిఫా గ్రౌండ్ , సక్సెస్ స్కూల్, ఎస్‌‌‌‌‌‌‌‌జె రోటరీ చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ మీదుగా మలక్‌‌‌‌‌‌‌‌పేట్ మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి. 

కేబీఆర్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ వేలో మార్పులు 

పరిశీలించిన జీహెచ్ఎంసీ, పోలీస్ ​కమిషనర్లు

కేబీఆర్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ చుట్టూ అమలు చేస్తున్న వన్‌‌‌‌‌‌‌‌వే విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు పలు మార్పులు చేయనున్నారు. వన్‌‌‌‌‌‌‌‌వే విధానం అమల్లోకి వచ్చి 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో బుధవారం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సీపీ వీసీ సజ్జానర్‌‌‌‌‌‌‌‌, టీజీఎస్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ సీఎండీ జితేష్‌‌‌‌‌‌‌‌ వి.పాటిల్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ కాలనీ, రోడ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 45, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌, కేబీఆర్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌ జంక్షన్లను పరిశీలించారు. 

వాహనాల వేగం తగ్గుతున్న బాటిల్‌‌‌‌‌‌‌‌నెక్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన మార్పులు చేయాలని, ఎక్కడైతే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ రద్దీ ఏర్పడుతోందో అక్కడ రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. రోడ్ల రిపేర్లను పూర్తి చేయడంతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జంక్షన్‌‌‌‌‌‌‌‌ నుంచి రోడ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 45 జంక్షన్‌‌‌‌‌‌‌‌ వరకు ఉన్న రోడ్డును విస్తరించేందుకు అడ్డుగా ఉన్న కరెంట్​స్తంభాలు, నీటి సరఫరా, డ్రైనేజీ ఇతర యుటిలిటీ లైన్లను  తరలించనున్నారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌ సీపీ డి జోయెల్‌‌‌‌‌‌‌‌ డెవిస్‌‌‌‌‌‌‌‌, డీసీపీ కాజల్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.