కరీంనగర్ జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఆర్ బీఎల్ బ్యాంకులో సుమారు రూ. వంద కోట్ల స్కాం జరిగినట్లు తెలిపారు పోలీసులు. మ్యుల్ అకౌంట్ల ద్వారా రూ. వంద కోట్ల సైబర్ స్కాం, హవాలా జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు పోలీసులు. నిందితులు నకిలీ ఖాతాలు తెరిచి డబ్బులు మళ్లించి భారీ మోసానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు
ఈ స్కాంకు సంబంధించి పదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.పోలీసుల అదుపులో తీసుకున్న వారిలో ఆర్ బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్ తో పాటు ఇతర ఉద్యోగులు, మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం.
ALSO READ : కవిత చెప్పిన సర్వోదయ తెలంగాణ అంటే ఏంటీ.. !
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని... విచారణ తర్వాత కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.
