
కరీంనగర్: వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో పులిహోర ప్రసాదం పంచిపెట్టారు. అయితే ఆ పులిహోర తిన్న 100 మందికి పైగా గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం కరీంనగర్ జిల్లాలో జరిగింది.
గంగాధర మండలం లింగంపల్లి గ్రామంలో నిమజ్జనం సందర్భంగా గ్రామస్థులకు పులిహోర ప్యాకెట్లు పంచారు గణేష్ ఉత్సవ నిర్వాహకులు. ఏమైందో తెలియదు కానీ.. పులిహోరా తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని పడిపోయారు. బాధితులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. మరి కొంతమందికి గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏదైనా విష ప్రయోగం జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.