
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను మొహరించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర డీజీ దిల్‌బాగ్ సింగ్.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతోనే కేంద్రం అదనపు బలగాలను మొహరించిందన్నారు. ఉత్తర కశ్మీర్‌లో సైనికల బలగాలు తక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 100 కంపెనీల పారామిలిటరీ బలగాలను రాష్ట్రానికి పంపించిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాయు మార్గం ద్వారా సైనికులను కశ్మీర్‌కు తరలించినట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్ర కారణంగా ఇటీవలే దాదాపు 40వేల మంది అదనపు బలగాలు రాష్ట్రానికి రప్పించారు.