ఏపీలో కొత్తగా 10,368 కేసులు..84 మంది మృతి

ఏపీలో కొత్తగా 10,368 కేసులు..84 మంది మృతి

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా 10,368 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,45,139కు చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 84 మంది మృతి చెందగా.. మొత్తం 4,053 మంది మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 9,350 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,210 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,39,876 మంది కోలుకున్నారు. కొత్తగా 59,834 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 37,82,746 టెస్టులు చేసినట్లు తెలిపింది వైద్యారోగ్యశాఖ.