మామూలు బామ్మ కాదు.. 106 ఏళ్ల వయసులో ఆల్బమ్

మామూలు బామ్మ కాదు.. 106 ఏళ్ల వయసులో ఆల్బమ్

మామూలుగా ఎవరైనాసరే 60 ఏళ్లు వచ్చేసరికే అయ్యో, అమ్మో అంటుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం 106 ఏళ్ల వయసులో ఉత్సాహంగా ఉంటూ.. తనకెంతో ఇష్టమైన మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. పారిస్‌కు చెందిన 106 ఏళ్ల కొలెట్ మేజ్ అనే మహిళకు చిన్నతనం నుంచే మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. అదే ఇష్టంతో ఆమె పియానోను నేర్చుకుంది. ఇప్పటికే అయిదు ఆల్బమ్‌లను విడుదల చేసిన మేజ్.. త్వరలో తన ఆరో ఆల్బమ్‌ను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె చేసిన కొత్త ఆల్బమ్ ఏప్రిల్ 2021లో విడుదల కానుంది. గత సంవత్సరం కూడా మేజ్ రెండు ఆల్బమ్‌లను విడుదల చేసింది.

కొలెట్ మేజ్ 1914లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తన తల్లి పర్యవేక్షణలో ఇంట్లోనే చదువుకుంది. ఆ తర్వాత పారిస్‌లోని పారిస్ ఎకోల్ నార్మలే డి మ్యూజిక్‌ స్కూళ్లో చదువుకుంది. మేజ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా యోగా మరియు ఫింగర్ జిమ్నాస్టిక్‌లను చేస్తుంది.

తనకు, తన గుండెకు మ్యూజిక్ ఆహారంలాంటిదని మేజ్ చెప్పుకొచ్చారు. కొలెట్ మేజ్ చాలామందికి ప్రేరణగా నిలిచిందని ఆమె కొడుకు ఫాబ్రిస్ మేజ్ అన్నారు. ‘ఆమె చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది. మీకు దేనిపట్లైనా ఇష్టం ఉంటే మీరు కూడా ఈ వయసులో మంచి ఫామ్‌లో ఉండగలరు’ అని అన్నాడు.

For More News..

సన్నీ లియోన్‌పై కేసు నమోదు..

ఐపీఎస్ అధికారికీ తప్పని కట్నం వేధింపులు

కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటి వరకు ఆస్తి నష్టం