ఫొటో కోసం మెలోనీ బతిమిలాడింది..ఇటలీ ప్రధానిపై ట్రంప్ కామెంట్స్

ఫొటో కోసం మెలోనీ బతిమిలాడింది..ఇటలీ ప్రధానిపై ట్రంప్ కామెంట్స్

రోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య చోటుచేసుకున్న ‘ఫొటో వివాదం’ అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటాలియన్ టెలివిజన్ ఛానల్ ‘లా7’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. జీ7 సదస్సులో తనతో ఫొటో దిగడానికి మెలోనీ ఎంతో ఆరాటపడిందని, తనను బతిమిలాడిందని అన్నారు. జాలిపడి ఫొటోకు అంగీకరించానని చెప్పారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల ను మెలోని ఖండించారు. ఆయన వ్యాఖ్యలు ‘పూర్తిగా కల్పితమైనవి’ అని పేర్కొంటూ మిత్రదేశాల పట్ల ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.. నేను కానీ, నా దేశం ఇటలీ కానీ ఎవరి ముందూ ఎన్నడూ మోకరిల్లం, ప్రాధేయపడం” అని మెలోనీ గట్టిగా బదులిచ్చారు.