
పదో తరగతి వరకు స్కూల్లో ప్రతి ఏడాది ప్రమోషన్ పొందుతుంటారు. అయితే ఇంటర్ చదవాలంటే పదో తరగతికి విద్యాశాఖ నిర్వహించే పరీక్షలు తప్పని సరిగా ఉత్తీర్ణులవ్వాలి. అయితే ఇలాంటి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు కొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలా చాలామంది ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలినస్తున్నారు కొందరు. ఇది ఇలా ఉండగా ఇలాంటి వారికి తాజాగా మహారాష్ట్రకు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే యువకుడి జర్నీ చూస్తే ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారు... అసలు ఏం జరిగిందంటే...
పట్టువదలని విక్రమార్కుడన్న పేరును మరో యాంగిల్‌లో చూపించాడు ఓ మహారాష్ట్ర విద్యార్థి. మహారాష్ట్ర బీడ్‌కు చెందిన కృష్ణ నామ్‌దేవ్ ముండే 2018నుంచి పది సార్లు పదో తరగతి పరీక్షలు రాసి తాజాగా ఉత్తీర్ణత సాధించాడు. కృష్ణ పదో ప్రయత్నంలో పదో తరగతి తరగతి పాసైన సందర్భంగా గ్రామస్తులు అతడిని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి వేడుక చేశారు. ఊరంతా అందరికి చక్కెర తీపి చేశారు. స్థానిక ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టారు. బాణసంచా కాల్చారు. ఇప్పుడీ ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రకు చెందిన కృష్ణ 2018లో మొదటిసారి పదవ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నిర్వహించే రెండుసార్లు పరీక్షలలో హాజరవుతున్న కానీ వరుసగా తొమ్మిది సార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయినా కానీ కృష్ణ ఓ పట్టువదలని విక్రమార్కుడిలా పదోసారి తన ప్రయత్నాన్ని చేస్తూ విజయాన్ని సాధించాడు. పదవసారి రాసిన పరీక్షలలో కృష్ణ పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాడు.
అయితే అతడి పదవ తరగతి ఉతీర్ణతను గ్రామ ప్రజలు అంత సులువుగా పక్కన తీసి పడేయలేదు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని గ్రామస్తులందరూ భుజాలపై ఎత్తుకొని బ్యాండ్ మేళంతో పటాకులు కాలుస్తూ గ్రామంలోని వీధుల్లో ఊరేగిస్తూ వేడుకలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయిన యువకుడు.. బ్యాండు మేళంతో ఊరేగించిన గ్రామస్థులు
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024
మహారాష్ట్ర - బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు.
దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు. pic.twitter.com/rDZ5AvMlbp