పాపన్నపేట, వెలుగు: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(17) కొత్తపల్లి హైస్కూల్లో పదో తరగతి చదివి ఇటీవల పరీక్షలు రాసింది. పరీక్షలు అయిపోయినప్పటి నుంచి ఆమె దిగులుగా ఉంటోంది.
పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానేమోనని తల్లిదండ్రులకు చెప్పింది. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయిప్రియ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

