
పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్.. తెలంగాణలో రేపు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను వెబ్‌సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. కాగా ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 2024 జూన్ 03వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు