
గవర్నర్ ను కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
10వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరింది. సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు పెరుగుతోంది. ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు ఓయూ జేఏసీ నేతలు. బస్ భవన్, కలెక్టరేట్లను ముట్టడించనున్నాయి లెఫ్ట్ స్టూడెంట్స్ యూనియన్లు. మరోవైపు డిపోల ముందు బతుకమ్మ ఆటలతో నిరసన తెలపనున్న కార్మికులు. ఆర్టీసీ సమ్మెకు రైతు, వ్యవసాయ కూలీల సంఘాల మద్దతు తెలిపాయి. మరోవైపు ఇవాళ గవర్నర్ ను కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు… సర్కార్ తీరుపై ఫిర్యాదు చేయనున్నాయి.
మొన్న ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు రాత్రి ఖమ్మంలో ముగిశాయి. మరోవైపు కర్వాన్ లో కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు కార్మికులు.