ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం
  • 11 మంది మౌంటెనీర్లు మృతి, 12 మంది గల్లంతు

జకర్తా :  ఇండోనేసియాలో ఓ అగ్ని పర్వతం పేలడంతో 11 మంది పర్వాతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 12 మంది గల్లంతయ్యారు. వాళ్ల  కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. సుమత్రా దీవిలోని 2,891 మీటర్ల ఎత్తున్న మరాపి అగ్ని పర్వతం ఆదివారం బద్దలైంది. దీంతో 3 కిలోమీటర్ల ఎత్తుదాకా బూడిద ఎగసిపడింది. ఆ సమయంలో పర్వతంపై 75 మంది మౌంటెనీర్లు ఉన్నారని, అందులో 49 మందిని వాపస్ తీసుకువచ్చామని చెప్పారు.

మిగతా 26 మందిలో 11 మంది మృత్యువాత పడ్డారని ముగ్గురిని కాపాడగలిగామని చెప్పారు. ఇంకో 12 మంది ఆచూకీ తెలియట్లేదని, రెస్క్యూ బృందాలు సెర్చింగ్ లో ఉన్నాయన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వేడి శిథిలాల పడ్డాయని తెలిపారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ​కష్టమవుతోందన్నారు. కాగా, పర్వతం చుట్టుపక్కలకు ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.